Monday, 22 October 2012

వత్తన్నా వత్తన్నా :)

అందరికి హాయ్ ..ఈ టపా(పోస్ట్) నేను తెలుగు లోనే రాద్దామని డిసైడ్ అయ్యాను...క్షమించాలి..నిర్ణయించుకున్నాను ..

వత్తన్నా..వత్తన్నా.. :)) ఏంటి అని ఆలోచిస్తున్నారా..? ఇంట్లో అందరికి నేనంటే  బాగా ఇష్టం కదా..అందరు నన్నే ఎపుడు  పిలుస్తూ ఉంటారు...అపుడు నా జవాబు  అది...వత్తన్నా..వత్తన్నా.. :))

నా అల్లరి బాగా పెరిగిపోయింది అండి...డాన్సులు..పాటలు...రైమ్స్ ఇలా  అన్ని చెప్పేస్తున్నా!! అమ్మ ను నానమ్మ ను బాగా విసిగిస్తున్నా పాపం...మా నానమ్మ అయితే నన్ను ఏమి అనలేక నా అల్లరి భరించలేక కష్టపడుతున్నారు. ఇంకా అమ్మ అయితే నాకు ఆమ్ పెట్టలేక అలిసిపోతుంది...ఆమ్ అక్కన్న (అక్కడ) తింటాను ఇక్కన్న (ఇక్కడ )  తింటాను అని తిప్పుతూ  ఉంటాను... ప్చ్!! పాపం కదా వాళ్లు.
వామ్మో...తెలుగు లోనే రాయాలంటే చాలా కష్టం అండి .... కాబట్టి ఈ టపా  ని  ఇంతటితో ముగించడమైనది...వచ్చే నెల లో  మళ్లి  కొత్త టపా తో కలుద్దాం.... అంత వరకు సెలవు ...